National27th Aug 08:23 AMSunil Byrisetty1 min read
హిమపాతమా? హిమగిరి కూలిందా?
నేపాల్ వరదల వెనుక ఏం జరిగిందనేది పజిల్ గా మారింది. బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలడమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. నేపాల్, టిబెట్‌ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తిక
నేపాల్ వరదల వెనుక ఏం జరిగిందనేది పజిల్ గా మారింది.
బాంబు పేలినట్టుగా మంచుకొండ కూలడమే కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. నేపాల్, టిబెట్‌ను వణికించిన ఆకస్మిక వరదలపై ఇప్పుడు మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.. హిమాలయాల్లోని ఓ గ్లేషియర్ నుంచి సుమారు 2 వేల అడుగుల వెడల్పున్న భారీ మంచుకొండ విరిగి పడినట్లు శాటిలైట్ చిత్రాల ఆధారంగా శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
ఆ భారీ కొండ 4 వేల అడుగుల లోతున్న లోయలోకి జారిపడినట్లు కథనం పేర్కొంది.
అంత భారీ కొండ పడడంతో... మంచు, రాళ్లు, నీరు ఒక్కసారిగా కదిలి... దిగువ ఆకస్మిక వరదలకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఈ అంశాలపై మరింత శాస్త్రీయ పరిశీలన అవసరం. ప్రకృతి ఎంతటి శక్తిని చూపించగలదో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.