News2nd Oct 01:36 PMSunil Byrisetty1 min read
సీమ రూపురేఖలు మార్చబోతున్నగ్లోబల్ హార్టికల్చర్ హబ్!
హైదరాబాద్ లో ఐఎస్ బి తరహా మ్యాజిక్ ఇప్పుడు రాయలసీమలో జరగబోతుంది. ఇక్కడకు రాబోయే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH) - ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) వ్యవసాయరంగ రూపురేఖలు మార్చబోతో
హైదరాబాద్ లో ఐఎస్ బి తరహా మ్యాజిక్ ఇప్పుడు రాయలసీమలో జరగబోతుంది. ఇక్కడకు రాబోయే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH) - ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) వ్యవసాయరంగ రూపురేఖలు మార్చబోతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ - ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి మంత్రి లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... విత్తనం దగ్గర నుండి, ఉత్పాదకత, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్, యాంత్రీకరణ, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వరకు ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. ఇక్కడ పండించిన పండ్ల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడే మన రైతులకు లాభం వస్తుంది. హార్టికల్చర్ హబ్ లక్ష్యం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే. మనం కేవలం ఇతర రాష్ట్రాలకు కావాల్సిన వెరైటీలే కాకుండా ఇతర దేశాలకు అవసరమైన రకాల పంటలు కూడా పండించాలి. అందుకు అనుగుణంగా మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, స్వీట్ ఆరెంజ్, అవకాడో, ఆపిల్, బెర్రీస్ వంటి ప్రతి వెరైటీకి సంబంధించి రీసెర్చ్ జరగాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.