News13th May 10:03 AMSunil Byrisetty1 min read
ఘనంగా శ్రీ భక్తాంజనేయ స్వామి గ్రామోత్సవం
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో వేంచేసియున్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ, జీవ,ధ్వజ, విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా స్వామివారి గ్రామోత్సవం ఘనంగా న
మంగళగిరి -తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో వేంచేసియున్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి విగ్రహ, జీవ,ధ్వజ, విమాన శిఖర ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా
స్వామివారి గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు.
ఉదయం విష్వక్సేనారాధనం, పుణ్యాహం, ప్రాతస్సవనం, చతుర్ధశ కలశ స్నపన, క్షీరాధివాసం అధివాసాంగ హోమం, కుంభాభి మర్మనం, ఉక్త హోమాదులు, నివేదన, హారతి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ భక్తాంజనేయ స్వామి వారిని ట్రాక్టర్ పై అధీష్టింపజేసి పుర వీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు.
ఆయా కూడళ్లలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంతకుముందు స్వామి వారికి సాయం సవనం, కుంభాభి మర్మనం, మూలమస్త్ర హోమాదులు, సర్వ దైవత్వ హోమం, మహర్షి వేదన హారతి పూజలు నిర్వహించి అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.