Spiritual22nd Aug 04:23 PMSunil Byrisetty1 min read

ఇంద్రకీలాద్రిపై గోవా సీఎం పూజలు

విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని

ఇంద్రకీలాద్రిపై గోవా సీఎం పూజలు
విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ప్రత్యేక పూజలు చేశారు. విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న జగన్మాత శ్రీ కనకదుర్గ అమ్మవారిని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) మరియు కార్యనిర్వహణాధికారి (ఈఓ) వి.కె. సీనా నాయక్ అత్యంత ఘనంగా స్వాగతం పలికారు.అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనం అందించగా, ఆలయ చైర్మన్ మరియు ఈఓ కలిసి ముఖ్యమంత్రికి శేషవస్త్రం, అమ్మవారి పవిత్ర చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను బహూకరించారు.
Andhra Pradesh
Pramod Sawant
Goa Chief Minister
Kanaka Durga Temple
Indrakeeladri
Vijayawada
Sri Durga Malleswara Temple
Special Prayers
అమ్మవారి దర్శనం
ఆలయ దర్శనం
ఆంధ్రప్రదేశ్
విజయవాడ వార్తలు
ఆధ్యాత్మిక వార్తలు
భక్తి వార్తలు
Scroll for the next article