News23rd Sep 04:05 PMSunil Byrisetty1 min read
బందరులో గోవా షిప్ యార్డు
మచిలీపట్నంలో గోవా షిప్ యార్డు కంపెనీ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. గోవా వెలుపల మెగా డిఫెన్స్ ప్రాజెక్టు ఏర్పాటు కావడం హర్షణీయ
మచిలీపట్నంలో గోవా షిప్ యార్డు కంపెనీ ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర హర్షం వ్యక్తం చేశారు. గోవా వెలుపల మెగా డిఫెన్స్ ప్రాజెక్టు ఏర్పాటు కావడం హర్షణీయమన్నారు. కేంద్ర కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ గోవా షిప్‌యార్డ్ కంపెనీ సుమారు రూ.8 వేల కోట్ల భారీ పెట్టుబడితో బందర్ పోర్టు కేంద్రంగా యుద్ధనౌకల తయారీ, మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 3,000 మందికి ప్రత్యక్షంగా, 5,000 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మచిలీపట్నం పోర్ట్ పరిధిలో దాదాపు 400 ఎకరాల భూమిని ఈ ప్రాజెక్ట్ కోసం కేటాయించబోతున్నామన్నారు. ఇండియన్ నేవీ, కోస్ట్‌గార్డ్‌కు అవసరమైన అత్యాధునిక యుద్ధనౌకలను గోవా షిప్ యార్డు కంపెనీ తయారు చేస్తుందన్నారు. ఇంతటి భారీ ప్రాజెక్టు ఏర్పాటుకు అన్ని రకాల తోడ్పాటు అందించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.