News28th Sep 12:02 PMSunil Byrisetty1 min read
పొంగిపొర్లుతున్న గోదావరి, కృష్ణమ్మ
గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ఇరు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజి ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.
గోదావరి, కృష్ణా నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. ఇరు నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ప్రకాశం బ్యారేజి వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజి ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 6.02 లక్షల క్యూసెక్కులుగా ఉంది.
ప్రవాహం 6.5 లక్షల క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరోవైపు గోదావరి వరద ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 42.4 అడుగుల నీటిమట్టం ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్&ఔట్ ఫ్లో 10.88 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. పొంగిపొర్లే వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదని తెలిపింది.