News5th Oct 03:58 PMSunil Byrisetty1 min read

గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ

ఆంధ్రప్రదేశ్ ప్రార్థనా గీతంలో గలగలా ప్రవహించే గోదావరి, బిరబిరా ప్రవహించే కృష్ణా నది అని ఉంటుందని, ఈ రెండు నదులనూ అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తమదని పేర్కొన్నా

గలగలా గోదావరి, బిరబిరా కృష్ణమ్మ
ఆంధ్రప్రదేశ్ ప్రార్థనా గీతంలో గలగలా ప్రవహించే గోదావరి, బిరబిరా ప్రవహించే కృష్ణా నది అని ఉంటుందని, ఈ రెండు నదులనూ అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చే బాధ్యత తమదని పేర్కొన్నారు. మూడేళ్లలో 35000 కోట్లతో 36 ప్రాజెక్టులు నిర్మించే క్యాలెండర్ తయారు చేశామని వివరించారు. చెప్పిన తేదీ ప్రకారమే పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. గోదావరి పుష్కరాల కన్నా ముందే పోలవరాన్ని పూర్తి చేసి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని చెప్పారు. గోదావరి, కావేరి నదులను అనుసంధానిస్తే, ఇలాంటి కరువులో కూడా సముద్రంలోకి వెళ్లిన 2000 టీఎంసీల నుంచి 200 -300 టీఎంసీలను తరలించి, రాయలసీమ కరువును జయించిన ప్రాంతంగా తీర్చిదిద్దగలుగుతామని వివరించారు. అందుకే గోదావరి, కావేరి నదులను అనుసంధానించి బనకచర్లకు, శ్రీశైలానికి నీరు వస్తే ఐదు నదులు అనుసంధానమై 4 రాష్ట్రాల్లో సమస్య పరిష్కారమవుతుందని చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, తుంగభద్ర, కావేరి నదులు అనుసంధానమవుతాయని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.
Scroll for the next article