Politics19th Oct 05:02 PMSunil Byrisetty1 min read

గోదావరి జిల్లాలు బిజెపికి అడ్డా

గోదావరి జిల్లాల్లో బిజెపి కి 27శాతం ఓటింగ్ వచ్చి అనేక గెలుపులు నమోదు చేసిన చరిత్ర ఈ ప్రాంతంలో బిజెపికి ఉందని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. కాకినాడ లో బిజెపి రాష్ట్ర ప్రధాన

గోదావరి జిల్లాలు బిజెపికి అడ్డా
గోదావరి జిల్లాల్లో బిజెపి కి 27శాతం ఓటింగ్ వచ్చి అనేక గెలుపులు నమోదు చేసిన చరిత్ర ఈ ప్రాంతంలో బిజెపికి ఉందని ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ అన్నారు. కాకినాడ లో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న అభినందన సభలో మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లో ప్రతిపక్షాలు ఊహించని ఫలితాలు బిజెపి గతం లో నమోదు చేసింది.అదే ఫలితాలు కొనసాగించిందని మాధవ్ వివరించారు. భారతీయ జనతాపార్టీ లో పదవులు అలంకారం కాదు ఇది ఒక భాద్యత అన్నారు.రాష్ఠ్రప్రధాన కార్యదర్శి పదవి పూర్తి స్థాయిలో పర్యటన,సంస్ధాపరమైన పని లో పూర్తిగా నిమగ్నమై ఉండాలి. పని భారం కూడా అధికంగా నే ఉంటుంది అటువంటి భాద్యతలు సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్న కు ఇవ్వడం జరిగింది.బిజెపి లో సుదీర్ఘ కాలం పని చేయడమే కోరుకుంటే పదవులు రావు. లక్ష్మి ప్రసన్న గతంలో పార్టీ కి చేసిన సేవలు గుర్తు చేస్తు బ్రాహ్మణ సమాజం రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.ఇటీవల కాలం లో బ్రాహ్మణు సమాజం రాజకీయాలకు దూరంగా ఉంటోంది.బిజేపి లోకి రావాలని ఈ వేదిక ద్వారా పిలుపు ఇచ్చారు. బిజెపి జాతీయ వాద దృక్పథంతో ముందుకు వెళుతోంది అన్నారు.
Andhra Pradesh Politics
BJP
P.V.N. Madhav
Saligrama Lakshmi Prasanna
Godavari Districts
Kakinada
బ్రాహ్మణ సమాజం
బిజెపి పార్టీ
Scroll for the next article