Spiritual13th Dec 03:19 PMSunil Byrisetty1 min read
2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు
2027 గోదావరి పుష్కరాల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగనున్నట్లు తెలిపింద
2027 గోదావరి పుష్కరాల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు జరగనున్నాయి. 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు కొనసాగనున్నట్లు తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఆస్థాన సిద్ధాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయం మేరకు తేదీలు ప్రకటించింది. విజయవాడలోని ఎండోమెంట్స్ కమిషనర్ నుంచి అందిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో కార్యదర్శి ఎం. హరి జవహర్ లాల్ నోటిఫికేషన్ జారీ చేశారు.