Spiritual25th Jun 12:09 PMSunil Byrisetty1 min read
గోదావరి పుష్కరాల నిర్వహణకు మంత్రుల కమిటీ
2027లో రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. పుష్కరాల నిర్వహణ పటిష్టంగా చేసేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. రాబోవు 2027 గోదావర
2027లో రాబోయే గోదావరి పుష్కరాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. పుష్కరాల నిర్వహణ పటిష్టంగా చేసేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. రాబోవు 2027 గోదావరి పుష్కరాలు సమర్థవంతంగా నిర్వహించడానికి.. విధానాలు రూపొందించుట కొరకు 12 శాఖల మంత్రులతో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేవదాయ శాఖ, జలవనరుల శాఖ, హోం శాఖ, పురపాలక శాఖ, రెవెన్యూ, పర్యాటకం, కార్మిక, రవాణా, వైద్యారోగ్యం, రోడ్లు, భవనాల శాఖలతోపాటు ఎనర్జీ, ఆర్థిక శాఖల మంత్రులు ఈ కమిటీలో ఉంటారు. ఆయా శాఖలన్నీ సమన్వయంతో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.