News25th Aug 05:38 PMSunil Byrisetty1 min read

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు

ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇ

అఖండ గోదారిని ఆరాధించేలా పుష్కరాలు
ప్రకృతి ఆరాధన-ఆధ్యాత్మిక చింతన మమేకం చేస్తూ గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. ఎక్కడా పవిత్రత దెబ్బతినకుండా, భక్తులకు సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు పుష్కరాలు అత్యంత వైభవంగా జరపాలని చెప్పారు. పుష్కరాలు కేవలం ప్రభుత్వం నిర్వహించడమే కాదని, స్థానిక ప్రజలను భాగస్వాములను చేయాలన్నారు. పుష్కరాల్లో భాగంగా రూ.4,026 కోట్లతో చేపట్టిన 4,932 పనులకు సంబంధించి పురోగతిపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.899 కోట్లు ఆర్ధిక శాఖ కేటాయింపులు జరిగాయని అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలో 1,869, పశ్చిమ గోదావరి జిల్లాలో 625, కోనసీమ జిల్లాలో 1,501, ఏలూరు జిల్లాలో 426, కాకినాడ జిల్లాలో 321, పోలవరం జిల్లాలో 190 పనులు చేపడుతున్నారు. అయితే ఈ పనుల పూర్తికి అవసరమైన నిధుల సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలని, కేంద్ర సాయం కూడా తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు.
Andhra Pradesh
Godavari Pushkarams
Godavari River
Chandrababu Naidu
Pushkaralu 2027
Spiritual Tourism
Religious Tourism
River Festivals
గోదావరి జిల్లాలు
అమరావతి
భక్తులు
మౌలిక వసతుల అభివృద్ధి
గోదావరి పుష్కరాలు
Scroll for the next article