National31st Jul 12:19 PMSunil Byrisetty1 min read

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి పెరుగుతోంది. 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద దిగువకు 9 లక్షల 30 వేల క్యూసెక్కుల వరద నీరు విడు

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి ఉధృతి పెరుగుతోంది. 43 అడుగులకు చేరడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద దిగువకు 9 లక్షల 30 వేల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేస్తున్నారు. 48 అడుగులకు చేరితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. గోదావరి పరివాహక, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరూ నదీ తీర ప్రాంతాలకు వెళ్లవద్దని, అధికారుల సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్రలో వర్షాల కారణంగా పై నుంచి గోదావరి వరద మరింత పెరిగే అవకాశాలున్నాయి.
Telangana
Bhadrachalam
Godavari River
Flood Alert
First Warning Level
Flood Discharge
Heavy Rainfall
Maharashtra
మహారాష్ట్ర వర్షాలు
విపత్తు నిర్వహణ
మాన్సూన్
Scroll for the next article