News26th Jul 11:06 AMSunil Byrisetty1 min read
పోలవరం వద్ద పోటెత్తుతున్న వరద
గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 32.2 అడుగుల నీటిమట్టం నెలకొంది. అలాగే కూనవరం వద్ద నీటిమట్టం 12. 26 మీటర్లు దాటుతోంది. ఇదిలా ఉంటే పోలవరం వద్ద వరద నీరు ప
గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతోంది. భద్రాచలం వద్ద ప్రస్తుతం 32.2 అడుగుల నీటిమట్టం నెలకొంది. అలాగే కూనవరం వద్ద నీటిమట్టం 12. 26 మీటర్లు దాటుతోంది. ఇదిలా ఉంటే పోలవరం వద్ద వరద నీరు పోటెత్తుతోంది. పోలవరం ప్రాజెక్టు వద్ద నీటిమట్టం 8.19 మీటర్లుగా నెలకొంది. మరోవైపు ధవళేశ్వరం వద్ద ఇన్&అవుట్ ఫ్లో 3.60 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో గోదావరి పరివాహక/ లంకగ్రామ/ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.