News2nd Sep 05:25 PMSunil Byrisetty1 min read
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. సీఎం జలహారతి
గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదారమ్మ ప్రవహించింది. ఎడమ కాల్వ ద్వారా విడిచే
గోదావరి జలాలు ఉత్తరాంధ్రకు చేరాయి. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదారమ్మ ప్రవహించింది. ఎడమ కాల్వ ద్వారా విడిచే నీటితో నాలుగు జిల్లాల పరిధిలోని 2.87 లక్షల ఎకరాలకు సాగునీరు, 5.23 లక్షల మంది తాగునీరు అందనుంది. అనకాపల్లి జిల్లాలో 1.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతోంది. ఎడమ కాలువ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,192 కోట్లు ఖర్చు చేసింది. అనకాపల్లి వద్ద ఏలేరు కాలువతో పాటు జిల్లాలోని 110 చెరువులను నింపేలా జల వనరుల శాఖ ప్రణాళిక రూపొందించింది. గోదావరి జలాలతో పుష్కర ఆయకట్టు పరిధిలో 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు కింద 80 వేల ఎకరాలు, పంపా కింద 12 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడి గెడ్డ ఆయకట్టు పరిధిలో ఉన్న 46,620 ఎకరాల స్థిరీకరణ జరగనుంది. 23.44 టీఎంసీలతో సాగు, తాగు నీటితో పాటు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని పారిశ్రామిక అవసరాలకు వినియోగం చేసుకోవచ్చు.