Spiritual28th Aug 03:52 PMSunil Byrisetty1 min read
గాజుల విశేషాలంకారంలో అమ్మవారు
గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం... చిన్న శివాలయంలో శ్రావణమాస పూజలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొ
గుడివాడ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన శ్రీ గౌరీ శంకర స్వామి వారి దేవస్థానం... చిన్న శివాలయంలో శ్రావణమాస పూజలు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. శ్రావణ శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారిని గాజుల విశేషాలంకరణతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.
తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేద పండితులు లంక చంద్ర ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు కొనసాగాయి.
శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణను దర్శించుకొని భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రావణ శుక్రవారం సందర్భంగా చిన్న శివాలయంలో భక్తిశ్రద్ధలతో జరిగిన ప్రత్యేక పూజలు, అమ్మవారి గాజుల అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.