Spiritual16th Oct 02:56 PMSunil Byrisetty1 min read
మూల నక్షత్ర వేళ.. సరస్వతీ దేవిగా దర్శనం
ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శుక్రవ
ఉండవల్లి సెంటర్‌లో శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శుక్రవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం పురస్కరించుకుని, చదువులకు, బుద్ధికి అధిదేవత అయిన శ్రీ సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. తెల్లవారుజాము నుంచే వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. చేతిలో వీణాధారై, జ్ఞానప్రదాయినిగా దర్శనమిచ్చిన సరస్వతీ దేవిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులతో పాటు విద్యార్థులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చదువుల తల్లి మూల నక్షత్రం రోజున దర్శనమివ్వడంతో, ఉదయం పూట ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చిన్నారులకు ఉచితంగా అక్షరాభ్యాస కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలతో అమ్మవారి సమక్షంలో అక్షరాభ్యాసం చేయించి, విద్యాబుద్ధులు లభించాలని ప్రార్థించారు.