News15th May 03:11 PMSunil Byrisetty1 min read
పశువులకు గోధార్ కార్డులు!
ప్రజలకు గుర్తింపు కోసం ఆధార్ కార్డులు ఉన్నట్లుగా పశువులకు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డులు రానున్నాయి. ఏపీలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన టెక్ ఏఐ కాంక్లేవ్లో స్టార్టప్ కంపెనీల
ప్రజలకు గుర్తింపు కోసం ఆధార్ కార్డులు ఉన్నట్లుగా పశువులకు కూడా ప్రత్యేక గుర్తింపు కార్డులు రానున్నాయి.
ఏపీలో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన టెక్ ఏఐ కాంక్లేవ్లో స్టార్టప్ కంపెనీలతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు.
మనుషులకు ఆధార్ తరహాలో పశువులకు గోధార్ కార్డులకు తీసుకురావాలనే అంశంపై చర్చలు జరిపారు.
పైలట్ ప్రాజెక్టుగా ముందుగా తిరుపతి జిల్లాలోని పశువులకు గోధార్ అనుసంధానం చేయాలన్నారు.
అలాగే, కోళ్లకు వచ్చే వ్యాధుల గుర్తింపు, ఆరోగ్య విషయాలపై ప్రత్యేక యాప్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.