Business Type23rd Oct 12:03 PMSunil Byrisetty1 min read
తగ్గిన బంగారం, వెండి ధరలు
ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.810 తగ్గి రూ.1,25,080 పలుకుతోంది. అలాగే 22 క్యారె
ఇటీవల భారీగా పెరిగిన బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.810 తగ్గి రూ.1,25,080 పలుకుతోంది. అలాగే 22 క్యారెట్ల 10గ్రా. గోల్డ్ ధర రూ.750 తగ్గి రూ.1,14,650కి చేరింది. కేజీ వెండిపై రూ.1,000 తగ్గి రూ.1,74,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండనున్నాయి. దీంతో బులియన్‌లో పెట్టుబడులు పెట్టినవారు ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇంకా తగ్గుతాయా లేక మళ్లీ పెరుగుతాయా అనే గందరగోళంలో ఉన్నారు.