Business Type30th Dec 12:01 PMSunil Byrisetty1 min read

పండుగల వేళ పతనమైన పసిడి

బంగారం, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే

పండుగల వేళ పతనమైన పసిడి
బంగారం, వెండి ధరలు గణనీయంగా పతనమయ్యాయి. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.3,050 తగ్గి రూ.1,36,200కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2,800 తగ్గి రూ.1,24,850గా నమోదైంది. మరోవైపు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కిలో వెండి ధర రూ.23 వేల మేర తగ్గి రూ.2.58 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల ఒడిదుడుకులు, డాలర్ బలపడటం, డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో ఈ తగ్గుదల చోటుచేసుకున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌ ముందు ధరలు తగ్గడంతో కొనుగోలుదారులకు ఇది కొంత ఊరట కలిగించేలా ఉంది.
Gold Prices
Silver Prices
Bullion Market
24 Carat Gold
22 Carat Gold
Silver Rate Today
Indian Market
International Market
Dollar Strength
Festive Season
Wedding Season
Buyers Relief
Scroll for the next article