News29th Jan 11:57 AMSunil Byrisetty1 min read

కనీవినీ ఎరగని స్థాయికి గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు

ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి రేట్లు కలలో కూడా ఊహించని స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ రేట్ల వద్ద కేవలం సంపన్న వర్గాలు మాత్రమే షాపింగ్ చేయగలవు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు

కనీవినీ ఎరగని స్థాయికి గోల్డ్ అండ్ సిల్వర్ ధరలు
ప్రపంచ వ్యాప్తంగా బంగారం, వెండి రేట్లు కలలో కూడా ఊహించని స్థాయిలకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఈ రేట్ల వద్ద కేవలం సంపన్న వర్గాలు మాత్రమే షాపింగ్ చేయగలవు. అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు భవిష్యత్తులో కొనలేమని అప్పులు చేసి మరీ షాపింగ్ చేయటం గమనార్హం. గ్లోబల్ రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ వడ్డీ రేట్ల, ఇండస్ట్రీ డిమాండ్ లాంటి కారణాలతో ఈ విలువైన లోహాలు పెరుగుతున్నాయి. మరోపక్క ప్రెసిడెంట్ ట్రంప్ ఫార్మా, ఆటో టారిప్స్ కూడా ప్రకటించటంతో చాలా మంది విలువైన లోహాలను హెడ్జింగ్ కోసం వాడుకుంటున్నట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే కొత్త ఏడాదిలో అంతర్జాతీయ పరిణామాలు మెల్లగా కొలిక్కి వచ్చేందుకు ప్రయత్నాలు జరిగితే ధరలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు బంగారం ధర 10 గ్రాములు దాదాపు లక్షా 80 వేలకు చేరగా.. వెండి కిలో రూ. 4 లక్షలు పలకడం రికార్డ్.
Gold Prices
Silver Prices
Precious Metals
Global Markets
Record High Rates
Dollar Weakness
Global Political Tensions
Federal Interest Rates
Industry Demand
Scroll for the next article