Business Type31st Oct 11:34 AMSunil Byrisetty1 min read
భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు
బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.3,380 దిగివచ్చి రూ.1,38,880కి చేరింది. అలాగే 22 క్యారెట్ల
బంగారం, వెండి ధరల పతనం కొనసాగుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇవాళ భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రా. పసిడి రూ.3,380 దిగివచ్చి రూ.1,38,880కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రా. బంగారం రూ 3,100 రూ, 1,27,300కి దిగింది. అటు కేజీ వెండి ధర రూ.10 వేలు పడిపోయి 11 నెలల కనిష్ఠానికి చేరింది. వెండి కేజీపై నెలలో 45 వేలు తగ్గింది. గత ధరలతో పోలిస్తే కేజీ ధర 4 లక్షలు ఉన్న వెండి నేడు 2 లక్షలకు తగ్గింది. బులియన్ మార్కెట్లో వెండి ధర పతనం కొనసాగుతోంది. ఢిల్లీలో కేజీపై రూ. 10,000 వేలు తగ్గి రూ.1,90,200కు చేరింది. ఫలితంగా ఈ నెలలో మొత్తం రూ.45వేలు పడిపోవడం గమనార్హం. దీంతో వెండి ధరలు 11 నెలల కనిష్ఠానికి చేరాయి. గతేడాది డిసెంబర్ 10న కేజీ సిల్వర్ రేట్ రూ.1.92లక్షలు పలికింది. క్రూడ్ ధర పెరగడం, ద్రవ్యోల్బణం, ఫెడ్ వడ్డీ రేట్ల ప్రభావంతో మెటల్ రేట్లు పడిపోతున్నట్లు మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.