Business Type6th Mar 09:57 AMSunil Byrisetty1 min read

గోల్డ్ లోన్ రెన్యువల్ మధ్యలో తీసేసిన బ్యాంక్ లు - !

ప్రజలకు బ్యాంక్ లు ఉపయోగపడటం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. ఎవరన్నా బ్యాంక్ వలో బంగారం తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకొన్నారు అంటే ప్రజల అవసరం కోసం. ఇటీవల కాలంలో బ్యాంక్ లు ఇబ

గోల్డ్ లోన్ రెన్యువల్ మధ్యలో తీసేసిన బ్యాంక్ లు - !
ప్రజలకు బ్యాంక్ లు ఉపయోగపడటం అంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు. ఎవరన్నా బ్యాంక్ వలో బంగారం తాకట్టు పెట్టుకొని డబ్బులు తీసుకొన్నారు అంటే ప్రజల అవసరం కోసం. ఇటీవల కాలంలో బ్యాంక్ లు ఇబ్బడిముబ్బడిగా బంగారం పై ఋణాలు ఇచ్చాయి.పోటీ పడి మరీ ఇచ్చాయి. ఆరు నెలల కొకసారి బ్యాంక్ కు వడ్డీ కట్టుకుంటే ఋణం ఇబ్బందిగా ఉండేది కాదు. కానీ బంగారం పై భారీగా ఋణాలు ఇచ్చిన బ్యాంక్ లు ఇప్పుడు బంగారం ఋణాలు రెన్యువల్ లేదు అని ఫోన్ లు చేయడంతో లక్షల మంది ఖాతాదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తీసుకున్న అసలు వడ్డీ వెంటనే కట్టాలి అని స్పష్టం చేయడంతో బంగారం కుదవ పెట్టిన వాళ్ళు బంగారం ఋణాలు తీర్చడానికి ఇంకో అప్పు చేస్తున్నారు. వ్యవసాయం కోసమో ,పిల్లల చదువుల కోసమో బంగారం పై ఋణాలు తీసుకొన్న వారు బ్యాంక్ లు పద్ధతి మార్చుకొని వెంటనే డబ్బులు చెల్లించమంటే ఎలా కట్టగలరు. బంగారు ఋణాలు రెన్యువల్ లేదని ముందుగానే బ్యాంక్ లు చెప్పి ఉంటే అసలు ప్రజలు బ్యాంక్ ల్లో బంగారం కుదవ పెట్టేవారు కాదు.ఋణాలు తీసుకున్న తరువాత బ్యాంక్ యాజమాన్యం రెన్యువల్స్ లేవు అని చెప్పడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దీనిపై స్పందిస్తే బాగుంటుంది. ప్రజల అవసరం కోసమే బ్యాంక్ లను ప్రజలు ఆశ్రయించారు దీనికి ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా. ఒక్కసారే బంగారం ఋణాలు రెన్యువల్ తీసేయడం సామాన్యులకు భారం కావడం వలన ప్రభుత్వం బ్యాంకర్స్ తో మాట్లాడితే బాగుంటుంది అని అడగవలసి వస్తుంది..
gold
bank
Intrest
government
బంగారం
బ్యాంకు
వడ్డీ
ప్రభుత్వం
Scroll for the next article