Business Type11th Apr 09:08 AMSunil Byrisetty1 min read
పసిడి ధరలు పతాక స్థాయికి.. అదే బాటలో వెండి!
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశంలో పసిడి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. అమెరికా- చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా వీటి ధరలు పుంజుకున్నాయి. సుంకాల పెంపు పోరుతో బంగా
బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
దేశంలో పసిడి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి.
అమెరికా- చైనా మధ్య పెరుగుతున్న వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా వీటి ధరలు పుంజుకున్నాయి.
సుంకాల పెంపు పోరుతో బంగారం ధరలు పెరగడం విశేషం.
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.2,940 పెరిగి, రూ.93,380కి చేరింది.
మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,700 పెరిగింది, రూ.85,600కి చేరుకుంది.
ఇక 18 క్యారెట్ల బంగారం ధర కూడా వరుసగా రూ.2,210 పెరిగి, ప్రస్తుతం రూ.70,040 స్థాయికి చేరుకుంది.
ఇప్పుడు సామాన్యులు పసిడి కొనుగోలు చేయాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడింది.
వాణిజ్య యుద్ధంతో పాటు, భవిష్యత్ ఆర్థిక సంక్షోభంపై అనిశ్చితి కూడా బంగారం ధరలను ప్రభావితం చేసింది.
వడ్డీ రేట్ల అంచనాలు తగ్గడం, ద్రవ్యోల్బణం వంటి అంశాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేశాయి.
అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొనసాగితే, బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్లో అంచనాలున్నాయి.
మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయి.
వెండి ధర ఒక కిలోకు రూ.2,000 పెరిగి రూ.1,04,000 వద్ద నడుస్తోంది