News4th Apr 12:11 PMSunil Byrisetty1 min read
పసిడి ధర మరింత ప్రియం.. లక్ష దాటేస్తుందా?
బంగారం ప్రియులకు షాక్ కొట్టేలా ధరలు పెరుగుతున్నాయి. అమెరికా, ఇతర దేశాల మధ్య సుంకాల వార్ ముదురుతుండటటంతో ఆ ప్రభావం బంగారంపై పడనుంది. ఇప్పటికే 10 గ్రాముల పసిడి ధర రూ. 90 వేలు దాటగా..
బంగారం ప్రియులకు షాక్ కొట్టేలా ధరలు పెరుగుతున్నాయి.
అమెరికా, ఇతర దేశాల మధ్య సుంకాల వార్ ముదురుతుండటటంతో ఆ ప్రభావం బంగారంపై పడనుంది.
ఇప్పటికే 10 గ్రాముల పసిడి ధర రూ. 90 వేలు దాటగా.. త్వరలో రూ.లక్షకు చేరుకోనుందని చెబుతున్నారు.
నెల క్రితం రూ.85,320గా ఉన్న 10 గ్రాముల బంగారం ధర దాదాపు ఆరేడు వేలు పెరిగింది.
ఇప్పుడు బంగారం ధరలు అల్ టైమ్ హైలో కొనసాగుతోన్నాయి.
ప్రపంచ మార్కెట్‌లోనూ బంగారం రికార్డులను సృష్టిస్తోంది.
స్పాట్ బంగారం ధర ఔన్సుకు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి రూ. 3,148.88 డాలర్లకు చేరుకుంది.
అనంతరం రూ.3,132.53 డాలర్ల వద్ద స్థిరపడింది.
10 గ్రాముల బంగారం ధర రూ. లక్ష చేరడానికి.. ఇంకా రూ. 9 వేలు పెరగాల్సి ఉంది.
బంగారంపై సుంకాల మోత మోగితే మాత్రం లక్ష మార్క్ దాటేయొచ్చని అంచనా వేస్తున్నారు.
అలా జరిగితే ఆ ప్రభావం విక్రయాలు, కొనుగోళ్లపై పడుతుందని భావిస్తున్నారు.