News14th May 04:51 PMSunil Byrisetty1 min read

కనకదుర్గమ్మ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర

విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ వారికి చేనేత కార్మికులైన భక్తులు అగ్గిపెట్టెలో పట్టు చీర సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తండ్రి

కనకదుర్గమ్మ అమ్మవారికి అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీర
విజయవాడలోని శ్రీ కనక దుర్గమ్మ వారికి చేనేత కార్మికులైన భక్తులు అగ్గిపెట్టెలో పట్టు చీర సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్ తండ్రి పరంధాములు వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని అగ్గిపెట్టలో చీర, శాలువాను, కుట్టు లేకుండా లాల్చి పైజామా, జాతీయ జెండాను అంతేకాకుండా మూడు కొంగుల చీర, ఊసరవెల్లిలా రంగులు మార్చే చీర, సుగంధ ద్రవ్యాల సువాసన వచ్చే చీర, దబ్బనంలో దూరిపోయే చీర, బంగారం, వెండి చీరలు రూపొందించారు. ఈ చేనేత కుటుంబం ప్రతి రెండేళ్లకోసారి వారి ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ కనక దుర్గ అమ్మవారి ఆశీర్వచన కోసం రావడం ఆనవాయితీ అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా అగ్గిపెట్టె లో ఇమిడే పట్టు చీర తయారుచేసి అమ్మవారికి అందించారు. చీర బరువు100 గ్రాములు, దీని పొడవు ఐదున్నర మీటర్లు, వెడల్పు 48 ఇంచులుగా ఉందని తెలిపారు. దీనిని పూర్తిగా పట్టు దారాలతో, గోల్డ్ జరీ వాడటం జరిగిందని, దీనిని తయారు చేయడానికి సుమారు ఐదు రోజుల సమయం పట్టిందని నల్ల విజయ్ కుమార్  తెలిపారు.
Vijayawada
Kanaka Durga Temple
Gold Saree in Match Box
సిరిసిల్ల వాస్తవ్యుడైన చేనేత కళాకారుడు నల్ల విజయ్ కుమార్
చేనేత కార్మికులైన భక్తులు అగ్గిపెట్టెలో పట్టు చీర సమర్పించారు
చీర బరువు100 గ్రాములు
Scroll for the next article