Spiritual1st Dec 05:26 PMSunil Byrisetty1 min read
శ్రీలక్ష్మి నృసింహునికి కిరీటం, కర్ణాభరణాలు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివార్లకు పట్టణానికి చెందిన మాజీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మకర్త వెనిగళ్ళ ఉమాకాంతం, భాగ్యలక్ష్మి కుటు
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో శ్రీ స్వామివార్లకు పట్టణానికి చెందిన మాజీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ధర్మకర్త వెనిగళ్ళ ఉమాకాంతం, భాగ్యలక్ష్మి కుటుంబ సభ్యులు, బంధువులు ఆధ్వర్యంలో సుమారు ఐదు లక్షల రూపాయల వ్యయంతో తయారు చేయించిన బంగారం పూత పూయించిన మూడు కిరీటాలు, 6 కర్ణాభరణాలు సమర్పించారు. ఉమాకాంతం, శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులు, బంధువులు సమర్పించిన కిరీటాలు, కర్ణాభరణాలను సోమవారం ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారికి, అమ్మవార్లకు ధరింపజేసి శాంతి కళ్యాణం నిర్వహించారు. శాంతి కల్యాణంలో ఉమాకాంతం శ్రీమతి భాగ్యలక్ష్మి దంపతులతో పాటు ఆభరణాల దాతలు వెనిగళ్ళ శివకుమార్ లక్ష్మీ, తిరుపతమ్మ దంపతులు, తదితరులు కూడా కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి కళ్యాణం నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు దివి అనంత పద్మనాభచార్యులు, అర్చకులు నల్లూరి రఘు కళ్యాణం నిర్వహించారు.