News24th Oct 03:08 PMSunil Byrisetty1 min read
బస్సు ప్రమాదం.. ఒకే కుటుంబంలో నలుగురు మృతి
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడం వారి బంధువుల్లో తీ
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగి పలువురు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం చెందడం వారి బంధువుల్లో తీవ్ర విషాదం నింపింది. వీరిని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... నెల్లూరు జిల్లా గొల్లవారిపల్లి గ్రామానికి చెందిన గోళ్ల రమేశ్ (35) కుటుంబం బెంగళూరులో జీవనం సాగిస్తుంది. రమేశ్ ప్రొడక్ట్ సేల్స్ ఆఫీసర్ జాబ్ చేస్తున్నారు. రమేశ్‌కు భార్య అనూష (32), పిల్లలు మన్విత (6), యశ్వంత్ (8) ఉన్నారు. దీపావళి సెలవుల కోసం రమేశ్ కుటుంబం హైదరాబాద్‌లోని వారి బంధువుల ఇంటికి వచ్చింది. గత రాత్రి వీరు హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సులో బెంగళూరుకు బయలుదేరారు. ఈ ప్రమాదంలో రమేశ్ కుటుంబంలోని నలుగురు మృతిచెందారు.ఇంకా బస్సులో పలువురు సజీవదహనం కాగా, కొందరు బస్సు అద్దాలు పగలగొట్టి బయటకు రావడంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి కర్నూలు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.