Business Type5th Jul 12:45 PMSunil Byrisetty1 min read

మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా ఫర్లేదు

అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా జులై 2 నుంచి, ఇండియన్ బ

మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా ఫర్లేదు
అకౌంట్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేస్తూ కొన్ని బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ జులై 1 నుంచి, బ్యాంక్ ఆఫ్ బరోడా జులై 2 నుంచి, ఇండియన్ బ్యాంకు జులై 7వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నట్లు తెలిపాయి. అతిపెద్ద జాతీయ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్పై రుసుమును ఎత్తివేసింది. మిగతా బ్యాంకులు సైతం ఇదే పంథాలో ముందుకెళ్లాలని ఖాతాదారులు కోరుతున్నారు. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను కొనసాగిస్తున్నాయి.
New Bank Rules
Minimum Balance Charges
bank accounts
canara bank
Punjab National Bank
indian bank
SBI
మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను పూర్తిగా రద్దు
Scroll for the next article