News23rd Jul 05:43 PMSunil Byrisetty1 min read

రాజధాని రైతులకు శుభవార్త!

అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా రైతులు కౌలు కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం కౌలు జమ చేసిం

రాజధాని రైతులకు శుభవార్త!
అమరావతి రాజధాని రైతులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా రైతులు కౌలు కోసం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజధాని అమరావతి రైతులకు ప్రభుత్వం కౌలు జమ చేసింది. బ్యాంకుల వారీగా రైతుల అకౌంట్లలో కౌలు జమ అవుతోంది. పెండింగ్ లో ఉన్న రెండు ఏళ్ల కౌలును అధికారంలోకి వచ్చిన వెంటనే చెల్లించింది. మళ్ళీ ఈ ఏడాది కౌలును కూడా రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. మొత్తం రూ.163.67 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. 18వేల 726మంది రైతులకు కౌలు జమైనట్లు సీఆర్డీఏ వెల్లడించింది. 88 మంది రైతులకు సాంకేతిక కారణాలతో జమ కాలేదు. కౌలు జమకాని వారు బ్యాంకు వివరాలు అందజేయాలని అధికారులు సూచించారు.
Andhra Pradesh news
Amaravati Farmers
Lease Payment
Amaravati Capital
CRDA
Farmer Welfare
Pending Lease Clearance
Landowners
Agriculture Support
వ్యవసాయ భూములు
రాజధాని రైతులకు కౌలు చెల్లింపు
Scroll for the next article