News17th Jul 05:28 PMSunil Byrisetty1 min read

అంగన్వాడీలకు శుభవార్త

ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ “తల్లికి వందనం” పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత

అంగన్వాడీలకు శుభవార్త
ముఖ్యమంత్రి చంద్రబాబు అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ “తల్లికి వందనం” పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్నారు. మహిళా, శిశు సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి మాట్లాడుతూ “అంగన్వాడీ సిబ్బంది ఎంతోకాలంగా ఈ శుభవార్త కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పలువురు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వ్యక్తిగతంగా కలిసి విజ్ఞప్తులను అందజేశారు. ఈ అంశంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, అర్బన్, రూరల్ ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అందరికీ ‘తల్లికి వందనం’ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించడం ఎంతో ఆనందదాయకం’ అని తెలిపారు. అంగన్వాడీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ కి అంగన్వాడీ కుటుంబాల తరఫున ధన్యవాదాలు తెలిపారు.ఈ నిర్ణయం అంగన్వాడీ సిబ్బందికి మరింత ఉత్సాహాన్ని, భరోసాను కల్పిస్తుంది. ప్రభుత్వం వారి సేవలను గుర్తించి తీసుకున్న ఈ నిర్ణయం చిరస్మరణీయంగా నిలుస్తుందని అన్నారు.
Andhra Pradesh
Talliki Vandanam
Anganwadi
Anganwadi Teachers
Mini Anganwadi Teachers
Anganwadi Helpers
Chandrababu Naidu
గుమ్మిడి సంధ్యారాణి
మహిళా శిశు సంక్షేమ శాఖ
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ పథకం
Scroll for the next article