News8th Apr 11:58 AMSunil Byrisetty1 min read

గుడ్ న్యూ్స్.. విజయవాడలో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ ఆఫీస్

ఏపీలో సుదీర్ఘ కాలంగా వినిపిస్తున్న డిమాండ్ నెరవేరింది. విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్ ఇక నుంచి పూర్తి స్థాయిలో సేవలందించనుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సిం

గుడ్ న్యూ్స్.. విజయవాడలో పూర్తిస్థాయి పాస్‌పోర్ట్ ఆఫీస్
ఏపీలో సుదీర్ఘ కాలంగా వినిపిస్తున్న డిమాండ్ నెరవేరింది. విజయవాడలో ఉన్న ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీస్ ఇక నుంచి పూర్తి స్థాయిలో సేవలందించనుంది. ఈ మేరకు కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్ కొత్త ఆఫీసును మంగళవారం(నేడు) ప్రారంభించనున్నారు. ఇన్నాళ్లూ పాస్‌పోర్ట్ ముద్రణ, జారీ కోసం వైజాగ్ పాస్‌పోర్ట్ ఆఫీస్‌కి పంపిస్తున్నారు. ఇకపై ఆ అవసరం లేకుండా విజయవాడలోనూ ముద్రించనున్నారు. దీంతో పాస్‌పోర్ట్ జారీ సమయం గణనీయంగా తగ్గనుంది. తప్పొప్పుల సవరణను కూడా ఇకపై 3 గంటల్లోనే పూర్తిచేయనున్నారు.
Vijayawada
Passport office
కేంద్ర సహాయమంత్రి కీర్తివర్ధన్ సింగ్
Scroll for the next article