Politics1st Mar 06:40 PMSunil Byrisetty1 min read

ఆశా’లకు ఆసరా: సీఎం చంద్రబాబు వరాలు

ఆశా వర్కర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. వారు ఎప్పటినుంచో కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు,ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మధ్య వారధులు

ఆశా వర్కర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీపి కబురు అందించారు. వారు ఎప్పటినుంచో కోరుతున్న ప్రయోజనాల అమలుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలు,ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మధ్య వారధులుగా నిలిచిన ఆశాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పచ్చజెండా ఊపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే 37,017 మందికి, పట్టణ ప్రాంతంలో పని చేసే 5,735 మంది ఆశా వర్కర్లకు లబ్ధి చేకూరనుంది. ఆరోగ్యశాఖపై జరిగిన సమీక్షలో సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ముందు ఆశాలకు ఇచ్చిన హామీ మేరకు సీఎం ఆమోదముద్ర వేశారు. గ్రాట్యుటీ చెల్లింపు ఏ విధంగా ఉండాలనే దానిపై వివిధ రాష్ట్రాల్లో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.
CM Chandra babu
asha workers
ap news సీఎం చంద్ర బాబు
ఆశా వర్కర్లు
ఏపీ న్యూస్
Scroll for the next article