News25th Apr 04:11 PMSunil Byrisetty1 min read
మత్స్యకారుల ఖాతాల్లోకి రూ. 258 కోట్లు జమ
చేపల వేటపై నిషేధం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26న ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించనున్నారు. ఈ సందర్భంగా
చేపల వేటపై నిషేధం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26న ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం గ్రామాన్ని సందర్శించనున్నారు.
ఈ సందర్భంగా మత్స్యకార చేయూత పథకంలో భాగంగా లబ్ధిదారులకు రూ. 258 కోట్ల నగదు పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.
చేపల వేటపై నిషేధం ఉన్న కాలంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ఈ నిధులు వెచ్చిస్తున్నారు.