News19th Jan 12:45 PMSunil Byrisetty1 min read

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక జీరో-బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని ప్రారంభించింది. గ్రూప్ ఎ, బి, సి కేడర్ల ఉద్యోగులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేక జీరో-బ్యాలెన్స్ శాలరీ అకౌంట్ ప్యాకేజీని ప్రారంభించింది. గ్రూప్ ఎ, బి, సి కేడర్ల ఉద్యోగులందరికీ ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. ఈ అకౌంట్ ద్వారా వ్యక్తిగత ప్రమాద బీమాతోపాటు వైకల్య కవరేజీ అందుతుంది. అలాగే ₹20 లక్షల వరకు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం లభిస్తుంది. బ్యాంకింగ్ కి సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్లో కనీస నిల్వ ఉంచాల్సిన అవసరం లేదు, ఇంకా మెయింటెనెన్స్ ఛార్జీలు సున్నాగా ఉండనుంది. RTGS, NEFT, UPI మరియు చెక్ బుక్ లావాదేవీలన్నీ పూర్తిగా ఉచితమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. 2047 నాటికి 'వికసిత భారత్', 'అందరికీ బీమా' లక్ష్యాలను చేరుకోవడంలో భాగంగా ఈ ప్యాకేజీని రూపొందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతతను అందించడమే దీని ప్రధాన ఉద్దేశ్యంగా ఉంది.
Central Government Employees
Zero Balance Salary Account
Ministry of Finance
Nirmala Sitharaman
Insurance Coverage
ఆర్‌టీజీఎస్
ఎన్ఈఎఫ్‌టి
యూపీఐ ఉచితం
వికసిత భారత్ 2047
ఉద్యోగుల సంక్షేమం
Scroll for the next article