TTD21st Jan 03:13 PMSunil Byrisetty1 min read
భక్తులకు గుడ్ న్యూస్.. రెండుపూటలా అన్నప్రసాదం!
భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇప్పటివరకు తిరుమల కొండపై , కొన్ని ప్రధాన దేవాలయాలలో మాత్రమే పరిమితంగా సాగుతున్న అన్నప్రసాద వితరణను,
భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది. ఇప్పటివరకు తిరుమల కొండపై , కొన్ని ప్రధాన దేవాలయాలలో మాత్రమే పరిమితంగా సాగుతున్న అన్నప్రసాద వితరణను, ఇకపై టీటీడీ పరిధిలోని ప్రతి ఆలయంలోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా, భక్తుల ఆకలి తీర్చడమే పరమావధిగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి నెలాఖరు నాటికి టీటీడీ పరిధిలోని 56 ఆలయాలతో పాటు అన్ని అనుబంధ సంస్థల్లో అన్నప్రసాద వితరణ ప్రారంభం కానుంది. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసే దిశగా టీటీడీ దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నూతన ఆలయాల నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది.