News10th Dec 12:17 PMSunil Byrisetty1 min read

డ్వాక్రా సంఘాలకు తీపి కబురు.. డబ్బులే డబ్బులు

ఏపీలో కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వాటి బలోపేతానికి రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ప్రకటించింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల కొత్త డ్

డ్వాక్రా సంఘాలకు తీపి కబురు.. డబ్బులే డబ్బులు
ఏపీలో కొత్తగా ఏర్పాటైన డ్వాక్రా సంఘాలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వాటి బలోపేతానికి రూ.3 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ప్రకటించింది. ఈ నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2 వేల కొత్త డ్వాక్రా సంఘాలకు రూ.15 వేల చొప్పున అందించనున్నారు. ఈ మొత్తాన్ని ఆయా సంఘాల సభ్యులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సంఘం ఖాతాలోనే నిల్వ ఉంటుంది. సంఘం నిధి పెంచేందుకు, సభ్యుల అవసరానికి అనుగుణంగా అంతర్గతంగా అప్పులు మంజూరు చేసుకునేందుకు, బ్యాంకుల ద్వారా ఎక్కువ మొత్తంలో సంఘానికి రుణం మంజూరయ్యేందుకు రివాల్వింగ్ ఫండ్ ఉపయోగపడుతుంది. త్వరలో సంఘాల ఖాతాల్లో నిర్దేశిత మొత్తం జమ కానుంది.
Andhra Pradesh Government
DWCRA
Revolving Fund
Women Self-Help Groups
Rural Development
ప్రభుత్వం ప్రకటన
మహిళా శక్తీకరణ
గ్రామీణాభివృద్ధి
Scroll for the next article