News21st Jan 03:16 PMSunil Byrisetty1 min read

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల బీమా

సముద్రంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేట కోసం సముద్రంలోకి వెళ్లి, ప్రమాదవశా

మత్స్యకారులకు గుడ్ న్యూస్.. రూ.10 లక్షల బీమా
సముద్రంపైనే ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మత్స్యకార కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వేట కోసం సముద్రంలోకి వెళ్లి, ప్రమాదవశాత్తు మరణించే మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోకూడదనే ఉద్దేశంతో బీమా మొత్తాన్ని ఐదు రెట్లు పెంచింది. ఇప్పటివరకు కేవలం రూ. 2 లక్షలుగా ఉన్న ప్రమాద బీమా పరిహారాన్ని ఏకంగా రూ. 10 లక్షలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలవుతున్న ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన, రాష్ట్ర ప్రభుత్వ నిధుల సమన్వయంతో ఈ పెంపును అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మత్స్యకారులు నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. మరణించిన మత్స్యకారుడు గుర్తింపు పొందిన మత్స్యకార సహకార సంఘంలో సభ్యుడై ఉండాలి. వేట కోసం వెళ్లేటప్పుడు ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఫిషింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండటం ముఖ్యం. సముద్రంలోకి వెళ్లే బోట్లలో పనిచేసే సిబ్బంది, కార్మికులు తమ వివరాలను మత్స్యశాఖ అధికారుల వద్ద నమోదు చేసుకుని ఉండాలి.
Andhra Pradesh Government
Fishermen Welfare
Fishing Community
Insurance Scheme
₹10 Lakh Insurance
PM Matsya Sampada Yojana
Fisheries Department
మత్స్యకార కుటుంబాలు
సామాజిక భద్రత
Scroll for the next article