Farmers9th Jul 05:45 PMSunil Byrisetty1 min read
ధాన్యం రైతులకు శుభవార్త
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యం కు సంబంధించి 24 గంటల్లోనే నగదును రైతుల ఖాతాల్ల
రైతు సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల నుండి సేకరించిన ధాన్యం కు సంబంధించి 24 గంటల్లోనే నగదును రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గత రబీ 2024-25 సీజన్ లో రైతుల నుండి సేకరించిన వరి ధాన్యం బకాయి చెల్లింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చొరవతో పౌర సరఫరాల సంస్థకు 1000 కోట్ల రూపాయలు జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (NCDC) నుంచి ఏపి మార్క్‌ఫెడ్ కు రూ.1000 కోట్లు రుణం అనుమతి పొందామని, ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఏపి మార్క్‌ఫెడ్ నుండి సదరు రూ.1000 కోట్ల నగదును పౌర సరఫరాల సంస్థకు బదిలీ అయ్యాయని తెలిపారు. మార్క్‌ఫెడ్‌కు ఇప్పటికే ఉన్నటువంటి రూ.6,700 కోట్ల రుణానికి అదనంగా రూ.1,000 కోట్ల రుణాన్ని పొందామని తెలిపారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం నగదు చెల్లింపులు రైతులకు వెనువెంటనే చేయబడతాయని మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.