News17th Dec 05:02 PMSunil Byrisetty1 min read

హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి మక్కా హజ్ యాత్ర కు వెళ్లే ప్రయాణికులకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ, మైనా

హజ్ యాత్రికులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుండి మక్కా హజ్ యాత్ర కు వెళ్లే ప్రయాణికులకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అందచేస్తున్న ఆర్థిక చేయూతను సద్వినియోగం చేసుకోవాలని న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ కోరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి హజ్ కు వెళ్లే వారందరికీ రూ. లక్ష ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందని అమరావతిలో విడుదల చేసిన ప్రకటనలో మంత్రి వెల్లడించారు. ఆదాయంతో నిమిత్తం లేకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్లే యాత్రికులందరికీ మైనారిటీ సంక్షేమ శాఖ రూ.లక్ష సాయం అందిస్తుందన్నారు. ఇతర రాష్ట్రాల ఎంబార్కేషన్ కేంద్రాల నుండి వెళ్లే యాత్రికుల విమాన చార్జీల కంటే ఎక్కువ మొత్తం, విజయవాడ నుంచి వెళ్లే వారిపై పడుతున్న భారం తగ్గించేందుకు రూ. లక్ష ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందన్నారు. గన్నవరం విమానాశ్రయం పరిసర జిల్లాల యాత్రికుల సౌకర్యార్థం, ఏపీ రాజధానిగా అమరావతి ప్రాముఖ్యతను మరింత పెంచేందుకు, విజయవాడ నుండి హజ్ కి వెళ్లే యాత్రికులందరికీ ప్రభుత్వం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తుందని పేర్కొన్నారు.
Andhra Pradesh
Haj Pilgrims
Alliance Government
Chief Minister Chandrababu Naidu
Minority Welfare Department
Minister NMD Farooq
విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం
గన్నవరం విమానాశ్రయం
ఆర్థిక సహాయం
Scroll for the next article