News4th Sep 12:36 PMSunil Byrisetty1 min read
పల్నాడు ప్రజలకు గుడ్ న్యూస్
పల్నాడు జిల్లా రైలు ప్రయాణికులకు శుభవార్త. నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో పలు రైళ్లు ఆగనున్నాయి. ఇప్పటివరకు పిడుగురాళ్ల, చుట్టుపక్కల ప్
పల్నాడు జిల్లా రైలు ప్రయాణికులకు శుభవార్త. నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవతో పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో పలు రైళ్లు ఆగనున్నాయి. ఇప్పటివరకు పిడుగురాళ్ల, చుట్టుపక్కల ప్రాంతాల ప్రయాణికులు దూరప్రాంత రైళ్లు ఎక్కాలంటే అవస్తలు పడాల్సి వస్తోంది. హైదరాబాద్ వెళ్లేందుకు ఎక్కాల్సిన రైలు కోసం గుంటూరు స్టేషన్ కు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కాచిగూడ, లింగంపల్లి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లు పిడుగురాళ్ల రైల్వే స్టేషన్ మీదుగా వెళ్తున్నప్పటికీ అక్కడ స్టాపేజ్ లేకపోవడంతో ఆగవు. ఈ విషయంపై ఎన్నో ఏళ్లుగా పిడుగురాళ్ల, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ఈ విషయంపై చొరవ తీసుకున్న నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రైల్వే శాఖ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ప్రత్యేకంగా సంబంధిత అధికారులతో మాట్లాడి పిడుగురాళ్లలో స్టాపేజ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు సూచనలపై స్పందించిన రైల్వే శాఖ పిడుగురాళ్ల రైల్వే స్టేషన్లో స్టాపేజీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.