Education15th Nov 11:38 AMSunil Byrisetty1 min read
పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు శుభవార్త!
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏడాదికి 15 రోజుల క్యాజువల్ లీవ్‌కు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా
ఏపీ సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న పార్ట్‌టైమ్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఏడాదికి 15 రోజుల క్యాజువల్ లీవ్‌కు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా సంవత్సరంలో పనిచేసిన కాలాన్ని బట్టి సెలవుల లెక్కింపు జరపనుంది. సెలవు తీసుకున్నా పారితోషికంలో కోత విధించరాదని ఉత్తర్వుల్లో పేర్కొంది. సంబంధిత ప్రిన్సిపాల్ ముందస్తు అనుమతితోనే సెలవు వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. తరగతులు, విద్యా కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా చూడాలని సూచనలు ఇచ్చింది. సెలవుల వివరాలను నమోదు చేసి, పరిమితికి మించి మంజూరు చేయరాదని ప్రిన్సిపాళ్లకు ఆదేశం ఇచ్చింది. రాష్ట్రంలోని ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ సంస్థల్లో తక్షణమే అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేసింది.