News2nd Oct 12:18 PMSunil Byrisetty1 min read
రేషన్ కార్డుందా.. చౌక ధరలకే నిత్యవసరాలు
ఏపీ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో చౌక ధరలకే నిత్యవసరాలు అందించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు ఇతర ముఖ్యమైన నిత్యావసర
ఏపీ రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. త్వరలో చౌక ధరలకే నిత్యవసరాలు అందించనున్నట్లు పేర్కొంది. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా బియ్యంతో పాటు ఇతర ముఖ్యమైన నిత్యావసర వస్తువులను సబ్సిడీ ధరలకే అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా పంపిణీ చేయనున్న సరుకులు ఇలా ఉన్నాయి.
* కందిపప్పు (కేంద్రం నుంచి 1.20 లక్షల టన్నుల కేటాయింపు)
* చక్కెర (పంచదార)
* గోధుమపిండి
* పామాయిల్
రైతు బజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు
రాష్ట్రవ్యాప్తంగా 130 రైతు బజార్లలో కిలో ₹35 కే విక్రయించనున్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు 2 కిలోలు అందిస్తారు. అందుకోసం రేషన్ కార్డు లేదా ఆధార్ కార్డు చూపించాల్సి ఉంటుంది.