News1st Jan 04:11 PMSunil Byrisetty1 min read
ఎస్సీలకు గుడ్ న్యూస్.. లోన్లపై వడ్డీ మాఫీ!
ఏపీ సామాజిక సంక్షేమ శాఖ 11,479 మంది షెడ్యూల్డ్ కులాల రుణాలు లబ్ధిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు ₹193.40 కోట్లు (NSFDC) మరియు ₹66.04 కోట్లు (NSKFDC) నిధులతో రుణాలు గతంలో
ఏపీ సామాజిక సంక్షేమ శాఖ 11,479 మంది షెడ్యూల్డ్ కులాల రుణాలు లబ్ధిదారుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. సుమారు ₹193.40 కోట్లు (NSFDC) మరియు ₹66.04 కోట్లు (NSKFDC) నిధులతో రుణాలు గతంలో మంజూరు చేయబడ్డాయి. ఏపీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా.. జాతీయ ఎస్సీ కార్పొరేషన్, జాతీయ సఫారీ కర్మచారి అభివృద్ధి కార్పొరేషన్ నుంచి తీసుకున్న రుణాలపై ఉన్న వడ్డీ మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేసింది.
తీసుకున్న రుణానికి సంబంధించిన అసలు మొత్తాన్ని 4 నెలల్లోపు చెల్లించాలి. కోవిడ్-19 వల్ల లబ్ధిదారులు ఆర్థికంగా నష్టపోయి రుణాలను తిరిగి చెల్లించలేని స్థితిలో ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.