News25th Nov 12:35 PMSunil Byrisetty1 min read

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగుల ప్రమోషన్లపై జీఓఎం(గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) నేడు కీలక సమావేశం జరుగుతోంది. ఉ.11 గంటలకు మంగళగిరి డ

సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పనుంది. ఉద్యోగుల ప్రమోషన్లపై జీఓఎం(గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్) నేడు కీలక సమావేశం జరుగుతోంది. ఉ.11 గంటలకు మంగళగిరి డిప్యూటీ సీఎం కార్యాలయంలో సమావేశమై చర్చిస్తోంది. ప్రమోషన్ల ఫైనలైజేషన్, చానలైజేషన్‌పై మంత్రివర్గం చర్చించి, ఒక నిర్ణయానికి రానుంది. కాగా, సచివాలయ ఉద్యోగుల ప్రమోషన్లపై అధ్యయనం చేయాలని సబ్ కమిటీని ప్రభుత్వం గత నెలలోనే ఆదేశించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది.
AP Government
Secretariat Employees
Promotions
GOM Meeting
Andhra Pradesh News
Employee Benefits
Scroll for the next article