News26th May 05:12 PMSunil Byrisetty1 min read
శ్రీశైలం యాత్రికులకు గుడ్ న్యూస్
ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉద
ప్రఖ్యాత శైవక్షేత్రం శ్రీశైలంలో వెలసిన శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఆలయం అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు.ఆలయంలో ప్రస్తుతం శని, ఆది, సోమవారాల్లో ఉదయం, రాత్రి మాత్రమే మల్లన్న స్పర్శదర్శనాన్ని కల్పిస్తున్నారు. దీనికి టికెట్లను ఆన్ లైన్‌లోనే ఉంచుతున్నారు. తాజాగా స్పర్శ దర్శనం మధ్యాహ్నం స్లాట్‌ను కూడా ఆలయ అధికారులు పునరుద్ధరించారు. తాజా నిర్ణయంతో ఇకపై శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం కూడా భక్తులు మల్లికార్జునుడిని స్పర్శ దర్శనం చేసుకోవచ్చు. ఈ మూడు రోజులు మధ్యాహ్నం మల్లన్న స్పర్శదర్శనం చేసుకునే వారికి ఆన్ లైన్లో 350 టికెట్లు, కరెంట్ బుకింగ్‌లో 200 టికెట్లు అందుబాటులో ఉంచారు. శని, ఆది, సోమవారాల్లో మధ్యాహ్నం పూట కూడా స్పర్శదర్శనం కల్పించాలంటూ భక్తుల నుంచి పెద్ద ఎత్తున వస్తోన్న విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని అధికారులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని పునఃప్రారంభించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేశారు.