Education17th Sep 01:06 PMSunil Byrisetty1 min read

పిల్లలకు పండగే.. దసరా సెలవులు ఖరారు

పాఠశాలలకు దసరా సెలవులు ఖరారయ్యాయి. ఏపీ, తెలంగాణలో వచ్చే నెల ఏకంగా 13 రోజులు వరుస సెలవులు లభించనున్నాయి. 2026-27 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏపీతో పాటుగా తెలంగాణలోని ప

పిల్లలకు పండగే.. దసరా సెలవులు ఖరారు
పాఠశాలలకు దసరా సెలవులు ఖరారయ్యాయి. ఏపీ, తెలంగాణలో వచ్చే నెల ఏకంగా 13 రోజులు వరుస సెలవులు లభించనున్నాయి. 2026-27 విద్యా సంవత్సర అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏపీతో పాటుగా తెలంగాణలోని పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 22 వరకు దసరా సెలవులు వస్తున్నాయి. అక్టోబర్ 23న తిరిగి పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది దసరా అక్టోబర్ 20వ తేదీ మంగళవారం జరగనుంది. దసరా వేళ తెలుగు రాష్ట్రాల్లో నవరాత్రి వేడుకలు, తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పండగకు కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊర్లకు వెళ్లాలనుకునే విద్యార్థులు, ఉద్యోగులు ముందుగానే ప్రయాణ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. ఈ సమయంలో సెలవుల పైన విద్యా శాఖ స్పష్టత ఇచ్చింది. అక్టోబర్ 9 చివరి పనిదినం ఉంటుంది. సెలవుల తర్వాత అక్టోబర్ 23న బడులు తిరిగి ప్రారంభం అవుతాయి.
Andhra Pradesh Schools
Dasara Holidays 2026
Dasara Holidays
School Holidays
AP School Holidays
Telangana School Holidays
Telangana Schools
దసరా పండుగ
విజయదశమి
బతుకమ్మ
విద్యార్థుల వార్తలు
విద్యా వార్తలు
ఏపీ విద్యా వార్తలు
తెలంగాణ విద్యా వార్తలు
Scroll for the next article