Education12th Apr 10:51 AMSunil Byrisetty1 min read
ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ అడ్మిషన్స్.. ఏపీ ప్రభుత్వం జీవో
ఫీజుల పేరుతో విద్యా్ర్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసే ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత అడ్మిషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్ల
ఫీజుల పేరుతో విద్యా్ర్థుల తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేసే ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత అడ్మిషన్లు కల్పించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
హైకోర్టు ఆదేశాల మేరకు 2025-26 విద్యా సంవత్సరానికి పేద కుటుంబాల పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశాలు కల్పించాలని పేర్కొంది.
ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం చేసే ఖర్చు ఆధారంగా వ్యయాన్ని అంచనా వేసేందుకు కమిటీని ఏర్పాటు చేసింది.
అది నిర్ణయించిన ఫీజును ప్రభుత్వమే భరించనుంది. తద్వారా పేద విద్యార్థులకు కొన్నైనా ఉచిత ప్రవేశాలు లభిస్తాయి