News1st Sep 12:23 PMSunil Byrisetty1 min read

ఇల్లు లేని పేదలకు కేంద్రం శుభవార్త

ఇల్లు లేని నిరుపేదలకు కేంద్రం శుభవార్త ప్రకటించింది. పీఎంఏవై అర్బన్, పీఎంఏవై రూరల్ క్రింద కేంద్రాన్ని సహకారం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై అ

ఇల్లు లేని పేదలకు కేంద్రం శుభవార్త
ఇల్లు లేని నిరుపేదలకు కేంద్రం శుభవార్త ప్రకటించింది. పీఎంఏవై అర్బన్, పీఎంఏవై రూరల్ క్రింద కేంద్రాన్ని సహకారం అందించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పీఎంఏవై అర్బన్-2.0 పథకం కింద రాష్ట్రానికి కొత్తగా 17,912 ఇళ్ళకు కేంద్రం ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించి రూ.447.80 కోట్లు విడుదల చేయడానికి పరిపాలనా అనుమతులు జారీ అయ్యాయి. ఒక్కో ఇంటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.2.50 లక్షలు అందిస్తాయి. కేంద్రం రూ.లక్షన్నర, రాష్ట్రం రూ. లక్ష వాటాగా అందిస్తాయి. ఇందులో వీబీ జీరాంజీ కింద రూ.27 వేలు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కింద మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.12వేలు అదనంగా లభిస్తాయి. మొత్తంగా ఒక్కో లబ్ధిదారుకు రూ.2.89లక్షల ఆర్థిక సాయం అందనుంది. ఈ మేరకు జిల్లాల వారీగా కేటాయింపులు జరిగాయి. మొత్తం 17,912 గృహాల్లో 15,793 ఇళ్లు పట్టణ స్థానిక సంస్థల యూఎల్‌బీ పరిధిలోనూ, 2,119 ఇళ్లు పట్టణాభివృద్ధి సంస్థల యూడీఏ పరిధిలోనూ ఉన్నాయి.
Andhra Pradesh
PMAY Urban 2.0
Pradhan Mantri Awas Yojana
PMAY
Housing Scheme
Affordable Housing
Central Government
Homeless Poor
17
912 Houses
₹447.80 Crore
కేంద్రం రాష్ట్రం ఆర్థిక సాయం
స్వచ్ఛ భారత్ మిషన్
ఆంధ్రప్రదేశ్
ఏపీ న్యూస్
Scroll for the next article