News22nd Jul 01:24 PMSunil Byrisetty1 min read

తోతాపూరి మామిడి రైతులకు తీపిక‌బురు

తోతాపూరి మామిడి రైతుల ప‌క్షాన కూట‌మి ప్ర‌భుత్వం నిల‌బ‌డిన విష‌యం తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం అత్య‌ధిక దిగుబ‌డి రావ‌డంతో మామిడి ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ విష‌యాన్ని ముందే గ్రహించిన వ్

తోతాపూరి మామిడి రైతులకు తీపిక‌బురు
తోతాపూరి మామిడి రైతుల ప‌క్షాన కూట‌మి ప్ర‌భుత్వం నిల‌బ‌డిన విష‌యం తెలిసిందే. ఈ సంవ‌త్స‌రం అత్య‌ధిక దిగుబ‌డి రావ‌డంతో మామిడి ధ‌ర త‌గ్గుముఖం ప‌ట్టింది. ఈ విష‌యాన్ని ముందే గ్రహించిన వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు చిత్తూరు జిల్లాలో విస్తృతంగా ప‌ర్య‌టించి రైతులతో, ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీ ప్ర‌తినిధుల‌తో సమావేశాలు ఏర్పాటు చేసి వారి అభిప్రాయాల‌ను సేక‌రించారు. దిగుబ‌డి ఎక్కువ ఉండ‌టంతో మామిడి పంట‌ను ప‌ల్ప్ ఫ్యాక్ట‌రీలు త‌క్కువ ధ‌ర‌కు అడుగుతున్నార‌ని తెలుసుకున్న మంత్రి అచ్చెన్నాయుడు వెంట‌నే ఈ స‌మ‌స్య‌ను సీఎం చంద్ర‌బాబు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం చంద్ర‌బాబు ప‌ల్ప్ ఫ్యాక్టరీలు కేజీ మామిడిని 8 రూ కొనాల‌ని, 4 రూ స‌బ్సిడీ రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌చేస్తుంద‌ని తెలిపారు. కేజీ 12 రూ చొప్పున రైతుల‌కు అంద‌చేసే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఢీల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన మంత్రి అచ్చెన్నాయుడు కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మం త్రి శివ‌రాజ్ సింగ్ చౌహ‌న్ ను క‌ల‌సి తోతాపూరి మామిడి రైతులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి వివ‌రించి స‌బ్సీడి న‌గ‌దులో 50:50 నిష్ప‌త్తిలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు న‌గ‌దును చెల్లించే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.
Andhra Pradesh news
Totapuri Mango
Achchennaidu
Chittoor Farmers
Mango Price Drop
CM Chandrababu Naidu
Pulp Factories
Mango Subsidy
Shivraj Singh Chouhan
రైతు మద్దతు ధర
మామిడి రైతులకు సబ్సిడీ
Scroll for the next article