News9th Sep 08:25 AMSunil Byrisetty1 min read
గిరిజనులకు గుడ్ న్యూస్!
ఏపీ ప్రభుత్వం గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపం-2 పథకం కింద 23,912 గిరిజన కుటుంబాలకు 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనుంది. గతంలో 5 కిలోల సిలిండర్లు పొందిన వారికి
ఏపీ ప్రభుత్వం గిరిజనులకు గుడ్ న్యూస్ చెప్పింది. దీపం-2 పథకం కింద 23,912 గిరిజన కుటుంబాలకు 14.2 కిలోల గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందించనుంది. గతంలో 5 కిలోల సిలిండర్లు పొందిన వారికి ఇప్పుడు ఏడాదికి మూడు ఉచిత సిలిండర్లను 14.2 కిలోలతో అందించనున్నారు. దీనికి సంబంధించిన రూ.5.54 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఈ మొత్తాన్ని కంపెనీలకు చెల్లించడానికి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గిరిపుత్రుల గ్యాస్ కష్టాలు తీరనున్నాయి.